
పాశ్చాత్య పోకడలు, విదేశీ అనుకరణలతో మోతెక్కించిన భారతీయ సినిమా తన స్వరూపం మార్చుకుంది. దేశ సాంస్కృతిక అంశాలే ప్రధాన ఇతివృత్తాలుగా తెరకెక్కుతున్నాయి. 2025లో ‘కాంతారా చాప్టర్-1’, ‘ఛావా’, ‘ధురంధర్’ బాక్సాఫీస్ హిట్స్ తో వందల కోట్లు కొల్లగొట్టాయి. మన సొంత జానపద కథలు, చరిత్ర, జాతీయవాదం ఆధారంగా వచ్చినవే నిలబడుతూ పాన్ ఇండియా లెవెల్లో ఆడుతున్నాయి. కోస్తా కర్ణాటక పురాణాల్లోని మానవ-ప్రకృతి సంఘర్షణలతో కూడిన ‘కాంతారా’.. సీక్వెల్ కోసం ఎదురుచూసేలా చేసింది. శంభాజీ మహరాజ్ జీవితాన్ని గొప్పగా చూపించిన ‘ఛావా’ మకుటాయమానంగా నిలిచి భారతీయ భావోద్వేగాల్ని కళ్లకు కట్టింది. దేశంలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు తక్షణమే కనెక్ట్ అయింది. ఇక వాస్తవికతతో వచ్చిన ‘ధురంధర్’ సంచలనాలు తిరగరాస్తోంది. ఇలా కథను వర్ణించే శైలిని మార్చుకున్న దర్శకులు
విజయాల బాట పడుతున్నారు.