మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక ప్రకటనను షేర్ చేసింది. వీరికి వివాహమై రెండేళ్లు కాగా.. పరస్పరం ఇరువురి అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇక ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నందున తమ నిర్ణయం పట్ల అభిమానుల నుంచి మద్దతు కోరింది నిహారిక.
నిహారిక, చైతన్యకు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయని మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతే కొన్ని నెలల కిందటే డివోర్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు జూన్ 5న అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే నటి నిహారిక నేడు(బుధవారం) అఫిషియల్‌గా ప్రకటించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలే విడాకులకు కారణమని తెలుస్తోంది.
నిజానికి నిహారిక, చైతన్య విడిపోయారనే వార్తలు మార్చి నుంచే మొదలయ్యాయి. సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతోనే అభిమానులు ఈ విషయంలో నిర్ధరణకు వచ్చారు. కాగా వీరి పెళ్లి 2021 డిసెంబర్లో జైపూర్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి మెగా, అల్లు ఫ్యామిలీ నుంచి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుండగా.. నిహారిక నటిగా, నిర్మాతగా బిజీ అయిపోయింది.