బాలీవుడ్ యాక్టర్స్ జాన్వీ కపూర్(janhvi kapoor), వరుణ్ ధావన్(varun dhawan) మెయిన్ రోల్స్ లో వచ్చిన సినిమా ‘బవాల్’. నితిన్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా డైరెక్ట్ గా OTTలో రిలీజ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో జులై 21 నుంచి ఇది అందుబాటులో ఉంటుందని చిత్ర నిర్మాణాన్ని జాయింట్ గా చేపట్టిన నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్నైన్ మెంట్, ఎర్త్ స్కై పిక్చర్స్ ప్రకటించింది.
ఈ రోజు నుంచే ‘అశ్విన్స్’
హార్రర్ మూవీ గా తెరకెక్కిన సినిమా ‘అశ్విన్స్(asvins)’. వసంత్ రవి కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో విమలా రామన్ మెయిన్ రోల్ లో మెరిసింది. ఇటీవల విడుదలై డిఫరెంట్ ఒపీనియన్స్ అందుకున్న ఈ మూవీకి తరుణ్ తేజ డైరెక్టర్. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇది ఈ రోజు నుంచి ప్రేక్షకులను అలరించబోతున్నది.
‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’
డైరెక్టర్ గురుపవన్ తెరకెక్కించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. ఉదయ్ శంకర్ హీరోగా, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించారు. జులై 21 నుంచి ఇది ఆహా వేదికగా ప్రసారమవుతుంది.