ప్రతిభ(Talent) ఉన్నవారే సినీ ఇండస్ట్రీలో ఉంటారని పవన్ కల్యాణ్ అన్నారు. చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా సరే.. టాలెంట్ లేకపోతే అంతే సంగతులని గుర్తు చేశారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రెస్ మీట్లో ఇలా… ‘ప్రమోషన్ కోసం నిధి అగర్వాల్ పడ్డ కష్టం చూసి సిగ్గనిపించింది.. పొలిటికల్ గా పేరుండొచ్చు, దేశవ్యాప్తంగా తెలుసుండొచ్చు కానీ.. సినిమా పరంగా చాలా హీరోలతో పోల్చితే వాళ్లందరికంటే చాలా తక్కువోణ్ని.. మిగతావాళ్లకు అయినంతగా నాకు బిజినెస్ కాదు.. చాలా మంది నటుల్లో తానొకణ్ని తప్ప గొప్పేం కాదు..‘ అని అన్నారు. ఈ సినిమా షూటింగ్ ఐదేళ్ల పాటు సాగగా, ఈ నెల 24న విడుదల కానుంది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…:https://justpostnews.com