లైంగిక వేధింపుల కేసులో సినీ నృత్య దర్శకుడు(Choreographer) జానీ అలియాస్ షేక్ జానీ బాషా కోసం పోలీసు టీంలు జల్లెడ పడుతున్నాయి. ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకోగా తాజాగా అతడిపై పోక్సో కేసు ఫైల్ అయింది. తనను అత్యాచారం(Rape) చేశారంటూ 21 సంవత్సరాల యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కంప్లయింట్ ఇవ్వగా.. 17 ఏళ్ల వయసులోనే అఘాయిత్యానికి పాల్పడ్డందున పోక్సో(ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైంది.
ముంబయి హోటల్లో తనపై దాడికి పాల్పడ్డ సమయంలో ఆమె మైనర్. దీంతో జానీపై పోక్సో(POCSO) కింద వివిధ సెక్షన్లను ఫైల్ చేశారు. అతణ్ని పట్టుకునేందుకు నాలుగు పోలీసు టీముల్ని రంగంలోకి దించారు. జానీని జనసేన బహిష్కరించగా, సినీ పరిశ్రమ వేటు వేసింది.