పవన్ కల్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్(Pre-Release) ఈవెంట్ కు అనుమతిచ్చిన పోలీసులు… కండీషన్ కూడా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిర్మాతదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈరోజు(జులై 21) సాయంత్రం వేడుక జరగనుంది. జనం నిండి, పాసులు లేక బయట ఉండేవారిని కంట్రోల్ చేసే బాధ్యత నిర్మాతదేనని క్లియర్ కట్ గా చెప్పేశారు. పవన్ కూడా వస్తుండటంతో భారీగా వచ్చే అవకాశముంది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా RTC క్రాస్ రోడ్స్ లో జరిగిన తొక్కిసలాట తర్వాత పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఆ దుర్ఘటన తర్వాత చాలా ఈవెంట్లను హోటల్స్ లోనే చేస్తున్నారు.