సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తమ విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు పంపించారు. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు కోమాలో ఉన్నాడు. దీంతో అల్లు అర్జున్ ను A11గా కేసు నమోదు చేసి ఇప్పటికే అరెస్టు చేశారు. ఆయన్ను తొలుత రిమాండ్ కు పంపించగా, కోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులతో బయటకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు మరోసారి నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఏం చేయాలా అన్న సమాలోచనల్ని ఆయన తరఫు లాయర్లతో జరుపుతున్నారు.