పుష్ప-2 కథానాయకుడు అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులివ్వగా అందులో పలు విషయాల్ని ప్రస్తావించారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారన్న ప్రచారంతో ఆయనకు నిన్ననే రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులిచ్చారు. అయితే తొలుత ఆ నోటీసుల్లో… హాస్పిటల్ రావొద్దని, మాట కాదని వచ్చాక ఏదైనా జరిగితే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అయితే ఈరోజు తాజాగా మరో నోటీసు ఇచ్చారు. ఎలాంటి హడావుడి లేకుండా హాస్పిటల్ కు వచ్చి బాలుణ్ని పరామర్శించాలని, కేవలం గంట లోపే శ్రీతేజ్ ను పరామర్శించి వెళ్లాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అక్కడకు ఎప్పుడు వచ్చినా ప్రత్యేక సెక్యూరిటీ కల్పిస్తామన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికై ఆయన అరెస్టై బెయిల్ పై విడుదలయ్యారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం చేస్తుండగా.. ఇప్పుడు ఆయన రాక కోసం కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఆయన శ్రీతేజ్ వద్దకు వస్తారా, వస్తే ముందుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పోలీసులు గుర్తు చేశారు.