హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉన్న పూజా హెగ్డే పెళ్లి కూతురు కాబోతున్నదా.. అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు. ఆమె ఓ క్రికెటర్ తో మూడు ముళ్లు వేయించుకుంటున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈ భామ.. ముంబయికి చెందిన క్రికెటర్ తో ప్రేమాయణంలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై ఆమె ఫ్యాన్స్ లో యాంగ్జయిటీ కనిపిస్తుండగా.. ఆ వార్తలు మాత్రం కన్ఫర్మ్ కాలేదు.
పూజాకు క్రికెటర్లతో సంబంధాలు అంటగట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె ఓ కర్ణాటక క్రికెటర్ తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని ప్రచారం జరిగింది. సదరు క్రికెటర్ సోదరుడి పెళ్లికి కూడా ఈ హీరోయిన్ అటెండ్ అయిందన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత స్వయంగా ఆమెనే ఆ రూమర్స్ ను కొట్టిపడేసింది. ‘రాధేశ్యాం’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీలతో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది పూజా. ఇలాంటి పరిస్థితుల్లో పూజాహెగ్డే పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందా అన్న సంశయం ఆమె అభిమానుల్లో కనిపిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది.