బుట్ట బొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ చిత్రంలో కలిసి నటించిన ఈ భామ.. ‘గుంటూరు కారం’ మూవీకి సైతం మెయిన్ ఫిమేల్ లీడ్‌గా ఎంపికైంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఛాన్స్ కూడా మిస్సయ్యింది. అయితే మహేష్ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తన దగ్గరే ఉండిపోయింది. దీంతో ఆమెను ఎలాగైనా యూజ్ చేసుకోవాలనుకున్న మూవీ టీమ్.. తనతో స్పెషల్ సాంగ్ చేయించేందుకు సిద్ధమయ్యారని టాక్.
నిజానికి ‘గుంటూరు కారం’ కోసం మేకర్స్ పూజా హెగ్డేకు భారీ మొత్తాన్ని అడ్వాన్స్‌గా ముట్టజెప్పారు. అయితే ఇప్పుడు ఆ అడ్వాన్స్ తిరిగివ్వాలని ఆమెను కోరకుండా ఒక ప్రత్యేక సాంగ్‌తో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు పూజ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుండగా.. ఈ ఏడాది చివరన పాటను చిత్రీకరించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీ లీల, మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్న చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.