దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) శ్రీనివాస్ పై నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మరోసారి ఆరోపణలు చేశారు. ఆయనపై తరచూ విమర్శలు చేసే పూనమ్ ఈసారి.. సినీ పరిశ్రమ తీరును ప్రశ్నించారు. సినిమా ఛాన్సుల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని, ఆయన అడిగింది కాదనడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారని ఆమె ఆరోపణ. దీనిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించకున్నా ఆమె మాత్రం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. కొంతమంది ప్రముఖులు ఆమెకు అన్యాయం జరిగిందని భావిస్తే.. మరికొందరు మాత్రం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందంటున్నారు. ఆమె ట్వీట్ ఏంటంటే…
‘త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లయింట్ ఇచ్చి చాలా కాలమైంది.. ఆయన్ను ప్రశ్నించడం కానీ, చర్యలు తీసుకోవడం గానీ జరగలేదు.. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన త్రివిక్రమ్ ను ఇండస్ట్రీ ఇప్పటికీ పెద్దమనిషిగానే చూస్తోంది..’ అన్నది సారాంశం. మాయాజాలం మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్ట్స్ ఏంటి?, గగనంతోపాటు 15 దాకా చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో ఆమె చివరిసారిగా కనిపించింది.