‘కల్కి 2892 AD’తో రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తున్న ప్రభాస్.. కేరళ బాధితులకు తన వంతు సాయాన్ని(Donation) ప్రకటించారు. వయనాడ్ బాధితులకు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ఆయన టీమ్ ప్రకటించింది. కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్(CM Relief Fund) కు ఈ నిధుల్ని అందజేస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఇప్పటికే తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
చిరంజీవి-రాంచరణ్ రూ.కోటి సాయమందించగా.. ఇప్పుడు ప్రభాస్ అంతకు రెండు రెట్లను బాధితులకు అందిస్తున్నారు. అల్లు అర్జున్ సైతం రూ.25 లక్షలు ప్రకటించారు. 400 మంది దాకా ప్రాణాలు కోల్పోయి, వేలాది మంది నిరాశ్రయులైన వయనాడ్ ఘటనపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందిస్తున్నారు.