సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ కాన్సెప్ట్(Concept)తో వచ్చిన ‘కల్కి 2898 AD’ సినిమా బాక్సాఫీస్ బద్ధలు కొడుతున్నది. తొలిరోజు రూ.200 కోట్లు వసూలు చేసినట్లు ఇక తొలి వారంలో రూ.500 కోట్ల దాకా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీకి.. విడుదలకు ముందే వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.55 కోట్లు వచ్చాయి.
బాలీవుడ్ అప్పియరెన్స్…
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా అమెరికా, కెనాడాల్లో విపరీతమైన కలెక్షన్లు దక్కించుకుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మెయిన్ రోల్స్ లో.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన ‘కల్కి’.. ఈరోజు(జూన్ 27న) థియేటర్లలో సందడి చేసింది. దుల్ఖర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్, రాంగోపాల్ వర్మ అతిథి పాత్రల్లో మెరిసిన ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మించారు.
అశ్వత్థామగా…
అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వరుస ఫ్లాప్ ల తర్వాత వచ్చిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ ప్రస్తుతం దుమ్మురేపుతున్నది. థియేటర్లలో అభిమానుల సందడికి అంతులేకుండా పోయింది.