‘కల్కి 2898 AD’ రికార్డుల దిశగా కలెక్షన్లు వసూలు చేస్తున్నది. 6 రోజుల్లోనే రజనీకాంత్ ‘జైలర్’, విజయ్’లియో’ను దాటి రూ.615 కోట్లు రాబట్టింది. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ తో కూడిన ఈ మూవీ ఉర్రూతలూగిస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నది. రిలీజ్ నాడే రూ.193.5 కోట్లు దక్కించుకున్న ‘కల్కి’ ఏడు రోజుల్లో రూ.650 కోట్ల మార్క్ దాటుతుందని విశ్లేషకులు అంచనా వేశారు.
తమిళ్ మూవీల కన్నా…
రజనీ, విజయ్ నటించిన తమిళ్ మూవీలు ‘జైలర్’, ‘లియో’కు వరుసగా రూ.604.5 కోట్లు, రూ. 605.9 కోట్లు వచ్చాయి. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ప్రభాస్ మూవీ ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’ వరల్డ్ వైడ్ గా రూ.617.75 కోట్లు సంపాదించింది. ఆ రికార్డును కూడా ‘కల్కి’ దాటేయనుంది.
ఆ రెండింటిదే…
‘గదర్-2’ రూ.686 కోట్లను.. రూ.650 కోట్లతో తర్వాతి స్థానంలో ఉన్న ‘బాహుబలి’ని ఏడో రోజునాడే ‘కల్కి 2898 AD’ దాటేయబోతున్నది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మెయిన్ రోల్స్ లో.. బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకొణె, దిశా పటాని హీరోయిన్లుగా నటించగా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది.
భారతీయ సినీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్లు ఇలా…
స్థానం | సినిమా | మొత్తం వసూళ్లు(రూపాయల్లో) |
1 | దంగల్ | 2070.3 కోట్లు |
2 | బాహుబలి-2 | 1788.06 కోట్లు |
3 | ఆర్ఆర్ఆర్(RRR) | 1230 కోట్లు |
4 | కేజీఎఫ్(KGF)-2 | 1215 కోట్లు |
5 | జవాన్ | 1160 కోట్లు |
6 | పఠాన్ | 1055 కోట్లు |
7 | బజరంగ్ భాయీజాన్ | 922.03 కోట్లు |
8 | యానిమల్ | 915 కోట్లు |
9 | పీకే(PK) | 792 కోట్లు |
10 | గదర్-2 | 686 కోట్లు |
11 | బాహుబలి | 650 కోట్లు |
12 | సలార్ | 617.75 కోట్లు |
13 | ‘కల్కి 2898 AD’ | 615 కోట్లు(Running) |
14 | లియో | 605.9 కోట్లు |
15 | జైలర్ | 604.5 కోట్లు |