మహాకుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని ప్రయాగ్ రాజ్ లో ప్రకాశ్ రాజ్ పుణ్యస్నానం చేశారంటూ సోషల్ మీడియాలో ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆయన స్నానం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోపై వివిధ రకాలుగా కామెంట్లు వస్తున్నాయి. దీనిపై ‘X(పాత ట్విటర్)’లో ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే…
‘ఇది నకిలీ వార్త.. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి పవిత్ర పూజలను కూడా కలుషితం చేయడం వారి పని.. మతోన్మాదులు, పిరికిదళం చివరి ప్రయత్నం ఏంటంటే.. పవిత్ర వేడుకలో కూడా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం.. ఎంత అవమానకరం.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా.. అసలు నిజమేంటో తెలుస్తుంది..’ అంటూ ప్రకాశ్ రాజ్ కన్నడం, ఇంగ్లిషులో పోస్టులు పెట్టారు. మహాకుంభమేళాలో ఆయన పాల్గొన్నారన్న ప్రచారం బయటకు రావడంతోనే నెటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ పెట్టారు.