అహ్మదాబాద్ లో విమానం కూలిన టైంలో సినీ నిర్మాత మహేశ్ కలవాడియా(జిరావాలా) 700 మీటర్ల దూరంలో ఉన్నారు. ఈ గుజరాతీ ప్రొడ్యూసర్ ఏమయ్యారన్నది ఎవరికీ అర్థం కాలేదు. మొబైల్ చివరి లొకేషన్ ను జిరావాలా(Jirawala) భార్య షేర్ చేయడంతో విషయం తెలిసింది. అప్పట్నుంచి అదృశ్యంగానే మిగిలిపోయిన ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. ఫ్లైట్ కూలడంతోనే చనిపోయారని అధికారులు గుర్తించారు. DNA టెస్టు చేస్తే కుటుంబ సభ్యులతో మ్యాచ్ అయింది. ఫ్లైట్ కూలిన చోట యాక్టివా స్కూటర్, ఫోన్ ను గుర్తించారు. మృతదేహాన్ని ఫ్యామిలీ అప్పగించారు. ఆ విమానం ఎక్కాల్సిన మహిళ ట్రాఫిక్ లో ఇరుక్కుని ప్రాణాలతో బయటపడితే.. రోడ్డుపై వెళ్తున్న నిర్మాత, హాస్టల్లో ఉంటున్న మెడికోలు మృత్యువాత పడటం విధి వైచిత్రి.