
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరో క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ‘ప్రాజెక్ట్ కె’ కోసం ఈ బడా స్టార్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌తో పాటు బడ్జెట్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే కమల్ హాసన్ రూ. 20 కోట్లు, దీపిక రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనుండగా.. అమితాబ్‌కు రూ. 18 కోట్లు, దిశా పటానీకి రూ. 2 కోట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన స్టార్ కాస్టింగ్ రెమ్యునరేషన్ ఏకంగా రూ. 200 కోట్లకు చేరింది. మరోవైపు ప్రొడక్షన్ కాస్ట్ రూ. 400 కోట్లు. ఈ మేరకు మొత్తంగా మూవీ బడ్జెట్ రూ. 600 కోట్లు అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ చివరి చిత్రం ‘ఆదిపురుష్’ కోసం రెమ్యునరేషన్‌గా రూ. 100 కోట్లు అందుకున్నట్లు టాక్. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం పర్వాలేదనిపించింది. ఇదంతా ప్రభాస్ స్టార్‌డమ్‌తోనే సాధ్యమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్‌కు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ వెనకాడటం లేదు. అందుకే ‘ప్రాజెక్ట్ కె’ కోసం రూ. 150 కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమైనట్లు వినికిడి.