త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. సంక్రాంతి టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ ఈ రోజు (శనివారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఇందులో పూజా హెగ్డే మెయిన్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తుందని ముందుగా ప్రకటించినప్పటికీ ఇప్పుడు తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సెకండ్ లీడ్‌గా ఉన్న యంగ్ హీరోయిన్ శ్రీలీల లక్కీ చాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ చిత్రంలో తనే మెయిన్ లీడ్‌గా మహేష్ సరసన నటించనుంది. ఇదే క్రమంలో సెకండ్ ఫిమేల్ లీడ్ కోసం వేట మొదలుపెట్టింది మూవీ టీమ్.
తెలుస్తున్న సమాచారం మేరకు ‘హిట్’ ఫేమ్ మీనాక్షి చౌదరిని ఈ రోల్ కోసం ఎంపిక చేశారట మేకర్స్. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. అయితే, పూజా హెగ్డే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతోనే మరో ఆప్షన్ వైపు మేకర్స్ మొగ్గు చూపారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ లెక్కన లేటెస్ట్ ఛేంజెస్ ప్రకారం పూజ అడిగిన రెమ్యునరేషన్లోనే ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లను సెట్ చేశారనే న్యూస్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో ‘గుంటూరు కారం’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్‌కు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే.