ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, పాపులర్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలకెక్కింది(Ready). ఈ జోడీ(Combination)తో ఇంతకుముందు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’.. దర్శకుడు పూరీకి ఎనలేని బలాన్నిచ్చింది. బంపర్ హిట్ సాధించిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందిస్తున్నారు.
2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో కోలుకున్న పూరీ… ఈ కొత్త మూవీతో మరోసారి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించారు. పూరీ కనెక్ట్స్ బ్రాండ్ గా రాబోతున్న ఈ మూవీని ఆయనతోపాటు ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.
పోస్టర్ రిలీజ్…
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఈ సినిమా కథానాయకుడు రామ్ ఎదురెదురుగా కూర్చున్న పోస్టర్ రిలీజైంది. మరో 40 రోజుల్లో ఆగస్టు 15 నాడు ‘డబుల్ ఇస్మార్ట్’ను విడుదల చేయనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.