‘పుష్ప’ బంపర్ హిట్ తో ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’కి సంబంధించిన రిలీజ్ డేట్(Release Date) ప్రకటించినా అది వాయిదా పడింది. ‘ఐకాన్ స్టార్(Icon Star)’, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి.
ఆగస్టు 15న ‘పుష్ప 2’ విడుదల కావాల్సి ఉన్నా దాన్ని డిసెంబరు 6కు వాయిదా(Postpone) చేశారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కు సంబంధించిన పనులు పెండింగ్ లో ఉన్నందున రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎర్ర చందనం(Red Sandal) స్మగ్లింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన ‘పుష్ప ది రైజ్ ‘ దేశ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది.
2021లో వచ్చిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. రష్మిక మంధాన, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్నది. జగపతిబాబు, అనసూయ భరద్వాజ్, ధనంజయ్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా… దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.