‘పుష్ప’ బాక్సాఫీస్ హిట్ తో ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’కి సంబంధించిన టీజర్ వచ్చేసింది. ‘ఐకాన్ స్టార్(Icon Star)’, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. సోమవారం బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆయనకు.. టీజర్ రూపంలో సర్ ప్రైజ్(Surprise) ఇచ్చింది.
రెడ్ శాండల్ తో…
ఎర్ర చందనం(Red Sandal) స్మగ్లింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన ‘పుష్ప ది రైజ్ ‘ దేశ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది. 2021లో వచ్చిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. రష్మిక మంధాన, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్నది. ఈ ఆగస్టు 15న ‘పుష్ప-2’ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇంతకుముందే ప్రకటించింది.
42 ఏళ్ల…
అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది ఆయన సతీమణి స్నేహారెడ్డి. బన్నీ సాధించిన అచీవ్ మెంట్స్ ను గుర్తు చేసుకుంటూ సాగేలా ఈ సెలబ్రేషన్స్ ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్యే దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతడి విగ్రహాన్ని(Statue) పెట్టారు. జగపతిబాబు, అనసూయ భరద్వాజ్, ధనంజయ్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.