పుష్ప-2 సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా పుష్ప-2కు రెండో స్థానంలో నిలిచింది. 32 రోజుల్లోనే రూ.1,831 కోట్లు వసూళ్లు చేయగా.. బాహుబలి-2 రికార్డును దాటేసింది. గతంలో బాహుబలి-2 రూ.1,810 కోట్లు వసూలు చేసి సెకండ్ ప్లేస్ ఉంది. ఇప్పుడా రికార్డును అల్లు అర్జున్-డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప-2 తుడిచిపెట్టేసింది. విడుదలైన రోజు నుంచి ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇక మొదటి స్థానంలో దంగల్ సినిమా ఉండగా.. ఆ చిత్రం రూ.2,000 కోట్లు వసూలు చేసింది.