‘భోళాశంకర్’ సినిమా ఇప్పటికే నిర్మాతల వివాదంలో చిక్కుకుపోగా.. ఆ మూవీకి సంబంధించి టికెట్ల రేట్ల విషయంలోనూ ఇప్పుడు గందరగోళం ఏర్పడింది. అటు నిర్మాతపై కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో.. టికెట్ రేట్ల హైక్ కు సంబంధించి చిత్ర యూనిట్ కు ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ మూవీ షోస్(Shows) రేట్స్(Rates) పెంచుకోవడానికి చిత్ర యూనిట్ ప్రభుత్వ అనుమతి కోరింది. అయితే అవసరమైన డాక్యుమెంట్స్ మూవీ యూనిట్ అందించలేదని AP సర్కారు చెబుతున్నది.
11 డాక్యుమెంట్లు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని అందజేస్తే అప్పుడు నిర్ణయం తెలియజేస్తామని అంటున్నది. మరోవైపు రేట్ల హైక్ పై నెల రోజుల ముందుగా అప్లయ్ చేసుకోవాలని అధికారులు అంటున్నారు. గతేడాదికి సంబంధించి IT ప్రూఫ్స్, GST డీటెయిల్స్ ఇవ్వలేదని, 20 శాతం షూటింగ్ APలో జరిగినట్లు ఆధారాలు సమర్పించలేదని తెలిపిన జగన్ సర్కారు.. పెండింగ్ డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేయాలని స్పష్టం చేసింది. అయితే ‘భోళాశంకర్’ నిర్మాత ఇప్పటివరకూ స్పందించకపోవడం విశేషంగా మారింది.
అటు ఈ సినిమా నిర్మాతలపై ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకెక్కారు. రూ.30 కోట్లు ఇవ్వాల్సి ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు బుధవారం నాడు ‘వాల్తేరు వీరయ్య’ 200 డేస్ ఫంక్షన్ లో మెగాస్టార్ మాట్లాడిన మాటలు హాట్ కామెంట్స్ అయ్యాయి. దీనిపై AP మంత్రులు చిరంజీవిపై ఎదురుదాడి చేశారు. ఈ రెండు వివాదాలు ఇలా కొనసాగుతున్న వేళ ఇప్పుడు రేట్ల పెంపు అనేది ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది క్వశ్చన్ మార్క్ గా తయారైంది.