సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధికార పార్టీ DMK మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుపానునైనా ఎదుర్కొంటుందని వివాదాస్పద రీతిలో మాట్లాడారు. కరుణానిధి జీవితంపై మంత్రి వేలు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ(Book Release) ఈ కామెంట్స్ చేశారు. DMK వంటి మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరంటూ మాట్లాడారు.
CM స్టాలిన్ సైతం ప్రభుత్వాన్ని చక్కగా నడుపుతున్నారంటూ ప్రశంసలు కురిపించారు. మరో తమిళ హీరో విజయ్ కొద్దికాలం క్రితం కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రజల ముందుకు రాబోతున్న పరిస్థితుల్లో రజనీ ఇలా మాట్లాడటం తమిళ్ పాలిటిక్స్ ను ఆసక్తికరంగా, గందరగోళంగా మార్చాయి.