స్టైలిష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన బిరుదుపై స్పెషల్ కామెంట్ చేశారు. సూపర్ స్టార్ అనేది ఎప్పుడూ తలనొప్పేనని, ఇది 1977 నుంచి చర్చకు కారణమవుతోందని అన్నారు. నెల్సన్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘జైలర్’ మూవీలో రజినీతోపాటు పలువురు సీనియర్ నటులు మెయిన్ లీడ్ పాత్రల్లో మెరుస్తున్నారు. బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటులు సునీల్ తోపాటు రమ్యకృష్ణ, తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘జైలర్’ మూవీ ఫంక్షన్ సందర్భంగా రజినీ కీలక కామెంట్స్ చేశారు.
‘సూపర్ స్టార్ అనే వర్డ్ ‘జైలర్’ మూవీలోని పాటలో వచ్చింది. ఈ పదాన్ని తొలగించాలంటూ డైరెక్టర్ కు చెప్పాను.. నిజానికి సూపర్ స్టార్ అనే బిరుదు నాకెప్పుడూ తలనొప్పి లాంటిదే.. 1977లో దీనిపై పెద్ద దుమారమే జరిగింది.. ఆ కాలంలో కమల్ హాసన్, శివాజీ గణేశన్ మెయిన్ యాక్టర్స్ గా ఉన్నారు.. అలాంటి సమయంలో సూపర్ స్టార్ బిరుదు నాకివ్వడం వివాదంగా మారింది’ అని గత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను జీవితంలో ఇద్దరికే భయపడతాను.. ఒకరు దేవుడైతే, రెండోది మంచి మనుషులకే’ అని రజినీ గుర్తు చేశారు.