జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్.. మరో కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నారు. విజయ్ హీరోగా ‘లియో’తో బాక్సాఫీస్ హిట్ కొట్టిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ ‘కూలీ’ మూవీ తెరకెక్కనుంది. జైలర్, లియో రెండూ కలెక్షన్లలో పోటీపడిన సంగతి తెలిసిందే.
భారీ అంచనాలతో వస్తున్న ‘కూలీ’కి సంబంధించి రజనీ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నలుపు, తెలుపు రంగులో రాజసింహాసనాన్ని(Royal Throne) పోలి ఉండే కుర్చీలో కూర్చున్న రజనీపై పోస్టర్ రిలీజైంది. ఇది ఆయనకు 171వ సినిమా.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తుండగా.. మరిన్ని వివరాల్ని త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు మేకర్స్.