మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆ టైమ్‌లో ఇండస్ట్రీలో నాన్-బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకుంది. ప్రత్యేకించి సుకుమార్ నెరేషన్, రామ్ చరణ్, సమంత పెర్ఫామెన్స్ ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన రంగస్థలం టాలీవుడ్లో కల్ట్ హిట్‌గా నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ మూవీని జపాన్‌లో రిలీజ్ చేయగా.. అక్కడ కూడా హవా చూపిస్తోంది.
ప్రస్తుతం జపాన్‌లో విడుదలైన రంగస్థలం.. ఈ ఏడాది అక్కడ విడుదలైన భారతీయ చిత్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా దూసుకుపోతోంది. అంతకుముందు ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఈ రికార్డ్ సాధించగా.. ఆ లెక్కలను తాజాగా రంగస్థలం అధిగమించింది. ఇక చరణ్‌కు జపాన్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘మగధీర’ చిత్రం అప్పట్లో అక్కడ అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసింది. గతేడాది RRR చిత్రానికి సైతం ఇలాంటి రెస్పాన్సే లభించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రంగస్థలం, KGF చిత్రాలు జపాన్‌లో ఒకే రోజున విడుదలయ్యాయి. కానీ కేజీఎఫ్ కంటే రంగస్థలం మూవీనే ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ లెక్కన లాంగ్ రన్లో ఊహించని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.