వరుస సినిమాలతో అన్ని లాంగ్వేజీల్లోనూ దూసుకుపోతున్న రష్మిక మంధాన.. సైబర్ క్రైమ్ బారిన పడింది. ఆమె మార్ఫింగ్ వీడియో(Deepfake Video) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. నల్లటి యోగా బాడీసూట్ ధరించిన మహిళ.. కెమెరా కోసం నవ్వుతూ ఎలివేటర్ లోకి ఎంటర్ అయిన సమయంలో తీసిన వీడియోను రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేశారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ట్విటర్(X)లో పోస్టులు పెట్టింది. ‘ఈ వీడియోను షేర్ చేయడం చాలా బాధగా ఉంది.. టెక్నాలజీ గొప్ప దుర్వినియోగం.. అత్యంత భయానకమైనది.. నేను స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఇది జరిగితే ఎలా పరిష్కరించేదాన్నో ఊహించలేను.. ఈ విషయంలో నాకు అండగా, రక్షణగా నిలిచిన నా కుటుంబం, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్ చేసింది.
స్పందించిన అమితాబ్, కేంద్ర మంత్రి
దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రెస్పాండ్ అవుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాద, హానికర సమాచారాన్ని ప్లాట్ ఫామ్ ల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తోపాటు సినీ లోకం రష్మికకు అండగా నిలిచింది. ‘లీగల్ కు ఇది బలమైన కేసు’ అని అమితాబ్ అన్నారు. ప్రస్తుతం రష్మిక ‘యానిమల్’ మూవీలో నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా తీస్తున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరో కాగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ మిగతా నటులు. ఈ మూవీ డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.