
మాస్ మహారాజ రవితేజ నటించిన చివరి చిత్రం ‘రావణాసుర’ ఏప్రిల్ 7న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్షనాగార్కర్, పూజిత పొన్నాడ, అను ఇమ్మాన్యుయేల్.. మొత్తంగా ఐదుగురు హీరోయిన్లు ‘రావణాసుర’ చిత్రంలో కనిపించారు. యంగ్ హీరో సుశాంత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కానీ ఇవేవీ సినిమాను బాక్సాఫీస్ వద్ద గట్టెక్కించలేకపోయాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ అయింది.
క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘రావణాసుర’ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను జులై 23న సాయంత్రం 6 గంటలకు ఫిక్స్ చేశారు. జీ తెలుగు ఛానెల్లో ఈ మూవీ ప్రసారం కానుంది. శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. కాగా.. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే.. రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర రావు, ఈగల్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది.