పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రిమిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. జులై 28న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోపే ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుండగా.. పవన్ ప్రస్తుతం వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు. అందుకోసమే నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకున్నారట. పవన్ వారాహి యాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. కాబట్టి ఆయన షెడ్యూల్స్కు అనుగుణంగా రాజమండ్రిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమిళ్లో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘బ్రో’ సినిమా రూపొందింది. పవన్‌కు సూటయ్యేలా కథలో చాలా మార్పులు చేశారు త్రివిక్రమ్. ఇక ఈ చిత్రంలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.