మెగా కుటుంబ వారసుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ మాదాపూర్ లోని N-కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరై జంటను ఆశీర్వదించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్యకు ఈ నెల 1న ఇటలీలోని టస్కానీలో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, అత్యంత దగ్గరి సన్నిహితులు మాత్రమే అటెండ్ కాగా.. మాదాపూర్ లో నిర్వహించిన రిసెప్షన్ కు అందరూ హాజరయ్యారు.