1975 జూన్ 26న విధించిన ఎమర్జెన్సీకి నిన్నటితో 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికార, విపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. కొత్తగా కొలువుదీరిన పార్లమెంటులో ఇదే పెద్ద చర్చకు, వివాదానికి దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాటి భయానక రోజుల్ని గుర్తుకు తెచ్చేలా బాలీవుడ్ నటి, MP కంగనా రనౌత్ ఏకంగా ‘ఎమర్జెన్సీ’ పేరిట సినిమానే తీసుకువస్తున్నది.
మండీ నుంచి…
హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి BJP తరఫున మొన్ననే MPగా గెలిచింది కంగనా. ఎన్నికల ప్రచారంలో సినిమా షూటింగ్ లను తగ్గించిన ఆమె.. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టిపెట్టింది. బయోగ్రాఫికల్ పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. వచ్చే సెప్టెంబరు 6న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందని తెలిపింది.
‘క్రూ’ వీళ్లే…
కంగనానే సొంతంగా కథ తయారు చేసిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌధురి, మిలింద్ సోమన్ వంటి తారలు నటిస్తుండగా.. 2022లో సినిమాను ఎనౌన్స్ చేశారు. ఇందిరగా కంగనా, జయప్రకాశ్ నారాయణగా అనుపమ్, వాజ్ పేయిగా తల్పాడే నటిస్తున్న ఈ మూవీకి దర్శకత్వం, నిర్మాత కంగనా రనౌతే.