అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో సినీ నృత దర్శకుడు(Choreographer) జానీకి కోర్టు రిమాండ్ విధించింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో అక్టోబరు 3 వరకు అతడు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండనున్నాడు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయినప్పట్నుంచి పరారీలో ఉన్న జానీ.. నిన్న గోవాలో పోలీసులకు దొరికాడు. అతణ్ని రాత్రి హైదరాబాద్ తరలించిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో విచారణ నిర్వహించారు. అనంతరం ఉప్పరపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.