పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో ఉంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ మాజీ హీరోయిన్.. ఈ మధ్యే నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన కొడుకు అకీరా నందన్ వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు వర్కవుట్స్ చేస్తూ తాను వింటున్న పాటల గురించి ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించింది.
రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోలో అకీరా జిమ్‌లో తెలుగు పాటలు వింటూ వర్కవుట్ చేస్తున్నాడు. అయితే ఈ వీడియోతో పాటు షేర్ చేసిన నోట్లో ఇలా రాసుకొచ్చింది. ‘నేను జిమ్‌లో ఇంగ్లీష్ సాంగ్స్ కాకుండా హిందీ మ్యూజిక్ ప్లే చేయమని అడిగినప్పుడు అందరూ నన్ను చదువుకోని పిచ్చిదానిలా చూశారు. కానీ నేను వాటిని అస్సలు పట్టించుకోలేదు. అందుకే అకీరా వర్కవుట్స్ చేస్తున్నప్పుడు అర్థం లేని ఇంగ్లీష్ పాటలు కాకుండా మాతృభాష పాటలను వినమని ప్రోత్సహించాను. ఇప్పుడు అతన్ని ఇలా చూసి గర్వపడుతున్నాను. ప్రజెంట్ జనరేషన్ కూడా మాతృభాషను గౌరవిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేసింది.