నా విషయంలో కల్యాణ్ చేసింది తప్పేనని, కానీ రాజకీయాల్లో ఆయనకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని పవన్ సతీమణి రేణు దేశాయ్ కీలక కామెంట్స్ చేశారు. ‘నా విషయంలో పవన్ చేసింది వంద శాతం తప్పే.. కానీ పవన్ జనం మనిషని ఎప్పుడూ నమ్ముతా.. ఆయన డబ్బు మనిషి కాదు.. డబ్బంటే ఇంట్రస్ట్ లేదు.. ఎప్పుడూ జనం కోసమే ఆలోచిస్తారు’ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ‘నేను ఇన్ని రోజులు ఫారిన్ లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా.. నా మాజీ భర్త గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆయన పర్సనల్ లైఫ్ పై షార్ట్ ఫిల్మ్ లు, మూవీలు తీస్తామంటున్నారు.. ఒక తల్లిగా ఒకటే చెబుతున్నా, మీ ప్రొఫెషన్ లోకి పిల్లల్ని లాగొద్దు.. వాళ్లకు పాలిటిక్స్ తో సంబంధం లేదు.. ఒక తల్లిగా లీడర్లను, ప్రత్యర్థులను, ఫ్యాన్స్ ని కోరుతున్నా’ అని అన్నారు.
పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి రాజకీయంగా మాట్లాడాలని, ఆయన ఒక సక్సెస్ ఫుల్ యాక్టర్ అయినా పాలిటిక్స్ లోకి వచ్చారని, ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలని పవన్ మాజీ సతీమణి రేణు కోరారు. ‘నేను ఆయన మాజీ భార్యగా మాట్లాడటం లేదు.. సమాజంలోని వ్యక్తిగా స్పందిస్తున్నా.. దయచేసి మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడకండి.. అది చాలా అన్ కంఫర్టబుల్ గా ఉంది’ అని ఆమె అన్నారు.