AP ముఖ్యమంత్రి జగన్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే ‘వ్యూహం’ మూవీని తీస్తున్నామని సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. జగన్ గురించి తాను ఏమనుకుంటున్నానన్నది ‘వ్యూహం’ సినిమా ద్వారా చూపిస్తానన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మూవీ షూటింగ్ సందర్భంగా RGV మాట్లాడారు. ప్రజలపై ‘వ్యూహం’ సినిమా ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో నాకు తెలియదు కానీ.. నేను అనుకున్న విధంగా దీన్ని తీస్తున్నాను.. ఇది రెండు పార్ట్ లుగా ఉంటుందని RGV తెలియజేశారు. నేను నమ్మిన నిజాన్నే సినిమాలో చూపిస్తానన్న ఆయన.. YS రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా ‘వ్యూహం’ సినిమా తీస్తున్నట్లు వివరించారు.
YS మరణం తర్వాత ఎవరెవరు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు అన్న కోణంలో ఈ మూవీ ఉంటుందని స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసును రెండో పార్ట్ లో చూపిస్తానని RGV తెలిపారు. APలోని అన్ని రాజకీయ ఘట్టాలను ‘వ్యూహం’ ద్వారా వెల్లడిస్తానని వివరించారు.