సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ మరోసారి కాంట్రవర్సీ సబ్జెక్ట్‌తో ముందుకొస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చిన ఆయన.. ఈసారి వైఎస్ జగన్, భారతి కోణంలో ‘వ్యూహం’ మూవీని రూపొందించారు. త్వరలోనే విడుదల కానున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు ఆర్జీవీ. 2009లో వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తప్పిపోయిన సీన్‌తో మొదలైన టీజర్.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వచ్చింది. జగన్ జైలుకు వెళ్లడం, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య.. ఈ ఎసిసోడ్స్ అన్నింటిలో జగన్, భారతి పన్నిన వ్యూహాల నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి పాత్రలో నటుడు అజ్మల్ అమీర్ కనిపించాడు. అజ్మల్‌తో పాటు మానస రాధాకృష్ణన్ పోషించిన వైఎస్ భారతి పాత్ర టీజర్లో ఆకట్టుకుంది. ఓవరాల్‌గా వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ టీజర్లో హైలైట్‌గా నిలిచింది. కాగా రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ మూవీ ఎవరికి రాజకీయ ప్రయోజనం చేకూరేలా తీర్చిదిద్దారో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
Nice