
ఆమె యాక్టింగ్ కెరీర్ లో ఒక్క హిట్టూ లేదు.. అలాగని వందల సినిమాలు చేయలేదు. కానీ ఆ నటీమణి ఆదాయం మాత్రం వేల కోట్లల్లో ఉంది. బాలీవుడ్ అయినా హాలీవుడ్ లో అయినా హీరోల కంటే హీరోయిన్లు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయినా ఆమె ఆదాయం ముందు అంతా దిగదుడుపేనట. మన దేశంలో షారుఖ్, సల్మాన్, ప్రభాస్, నాగార్జున ఇలా వీరంతా ఆమె సంపాదన ముందు తక్కువేనట. ఆ అత్యంత రిచెస్ట్ నటీమణి పేరు జామీ గెర్జ్(Jami Gertz). హాలీవుడ్ కు చెందిన ఈమె ప్రపంచంలోనే అత్యంత ధనిక యాక్ట్రెస్. ఈమె నికర ఆదాయం విలువ 3 బిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు మన కరెన్సీలో రూ.25,000 కోట్లు అన్నమాట. ఒక్క హిట్ మూవీలో నటించని జామీ.. గత 20 ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో కేవలం ఐదు సినిమాల్లోనే కనిపించింది. కానీ ఏంజెలినా జోలీ, జూలియా రాబర్ట్స్, జెన్నిఫర్ అనిస్టన్ కు లేని సంపాదన జామీ సొంతం. వీరితో పరిచయం ఉండి ఇంత పెద్దమొత్తంలో సంపాందించారు అనుకుంటే పొరపాటే. జామీ కేవలం బిజినెస్ ట్రిక్స్ వల్లే ఆ స్థాయిలో సంపాదిస్తూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
ప్రస్తుతం 57 ఏళ్ల వయసులో ఉన్న జామీ గెర్జ్ 70వ దశకంలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా హాలీవుడ్(Hollywood) ఎంట్రీ ఇచ్చింది. 1981లో ‘ఎండ్ లెస్ లవ్ తో’ సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. ‘ట్విస్టర్’, ‘స్టిల్ స్టాండింగ్’, ‘ది నైబర్స్’ చలన చిత్రాలతోపాటు టీవీ షోల్లో కనిపించింది. కానీ 1990 తర్వాత సినీ, టీవీ షోలను తగ్గించుకున్న జామీ 2022లో రిలీజ్ అయిన ‘ఐ వాంట్ యూ బ్యాక్’ లో చివరిసారిగా గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసింది. కేవలం బిజినెస్ వల్లే జామీ గార్జ్ ఈ స్థాయికి చేరుకుందని, తద్వారా ప్రపంచంలోనే ఆమెను ఢీకొట్టే యాక్టర్ లేరని సినీ ప్రపంచం అంటోంది.