ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన RRR మూవీ… గోల్డెన్ గ్లోబ్ సహా ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక జపాన్‌లో ఈ మూవీ ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే.. RRR టీమ్ తాజాగా మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఆస్కార్ అకాడమీ తన ర్యాంక్‌లో చేరడానికి 398 మంది కొత్త సభ్యులను ఆహ్వానించింది. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా RRR టీమ్ నుంచి మొత్తం ఆరుగురికి చోటు దక్కగా.. ఎంఎం కీరవాణి, చంద్రబోస్, కెకె సెంథిల్ కుమార్, సాబు సిరిల్‌కు కూడా ఉన్నారు. హాలీవుడ్ స్టార్స్ టేలర్ స్విఫ్ట్, ఆస్టిన్ బట్లర్, కే హుయ్ క్వాన్, ది డేనియల్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.
ఈ అచీవ్మెంట్ RRR టీమ్‌కి నిజంగా గర్వకారణం కాగా.. స్టార్ యాక్టర్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు సాంకేతిక నిపుణులకు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్కార్ కమిటీలో ఇప్పటికే 10 వేల మందికిపైగా సభ్యులున్నారు. ప్రస్తుతం మరో 398 మంది చేరడంతో మొత్తం సంఖ్య 10817కు చేరింది. మరోవైపు దిగ్గజ దర్శకుడు మణిరత్నం, VFX కళాకారులు సనత్ హరేష్, హింగోరాణి కూడా అకాడమీలో చేరారు.