విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న చిత్రం నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ‘సైంధవ్’పై భారీ అంచనాలున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి తాజా అప్డేట్ వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌లో ప్రారంభమైన సెకండ్ షెడ్యూల్ పూర్తయిందని సమాచారం. ఇదే విషయాన్ని నటి శ్రద్ధా శ్రీనాథ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ధృవీకరించింది.
గతేడాది ‘ఎఫ్3’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న వెంకటేష్ ఈ ఏడాది సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్’ చిత్రంలో తన మాస్ అవతార్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ రోల్ పోషిస్తున్నారు. రుహాని శర్మ సైతం కీలక పాత్ర పోషిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన గ్లింప్సీ వీడియో స్టోరీలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రివీల్ చేసింది. ఇక ఈ పాన్ ఇండియా మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తుండగా.. డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది.