రజనీకాంత్, హృతిక్ రోషన్ సినిమాలు బోల్తా పడ్డ సమయంలోనే.. కొత్త నటీనటులతో వచ్చిన మూవీ వందల కోట్లు కొల్లగొడుతోంది. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ‘సయ్యారా(Saiyaara)’.. 7 వారాల్లో రూ.581 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా రూ.412 కోట్లు, విదేశాల్లో రూ.169 కోట్లు రాబట్టింది. అహాన్ పాండే(Ahaan Pandey), అనీత్ పద్దా నటీనటులుగా పరిచయమయ్యారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ బాలీవుడ్ మూవీ జులై 18న విడుదలై ఫస్ట్ వీక్ లోనే రూ.172.75 కోట్లతో షేక్ చేసింది. కుర్రకారు ప్రేమ, విరహంతో నడిచిన కథకు విశేష స్పందన దక్కింది.