
Published 23 Dec 2023
కలెక్షన్ల పరంగానూ, రెమ్యునరేషన్ విషయంలోనూ రికార్డులు సృష్టిస్తున్న ‘సలార్'(Salaar) మూవీకి ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. నిన్న(డిసెంబరు 22) విడుదలైన ఈ సినిమాకి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను బద్ధలు కొడుతోంది. KGF క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’కు తొలిరోజు నుంచే హిట్ టాక్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్, టికెట్ బుకింగ్స్ లో అదరగొడుతూ .. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే నాడే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. అమెరికాలో 70 వేల టికెట్లు అమ్ముడై రూ.11 కోట్ల కలెక్షన్లతో 2023లో అత్యధికంగా వసూళ్లు చేసిన భారతీయ సినిమాగా రికార్డుకెక్కింది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ పై ముందునుంచీ అంచనాలు భారీగానే ఉండగా.. ‘జవాన్’, ‘జైలర్’, ‘లియో’ సినిమాలకు అందని రీతిలో దూసుకుపోతోంది.

ఆ సినిమా రికార్డు పదిలం…
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ హై లెవెల్లో ఉండగా, ప్రభాస్, పృథ్వీరాజ్ యాక్షన్ కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోలు నిన్న తెలంగాణవ్యాప్తంగా 20 థియేటర్లలో వేశారు. ఈ షోలకు ప్రేక్షకులు కిక్కిరిసిపోగా, పోలీసులు కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ‘సలార్’కు తొలి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాగా.. ఒకే ఏడాదిలో రెండు మూవీలు(‘ఆదిపురుష్’, ‘సలార్’) 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలుగా ప్రభాస్ కు నిలిచిపోయాయి. ఇప్పటివరకు భారత్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డు ‘RRR’కు ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ఆ మూవీకి ఫస్ట్ డే నాడే రూ.223 కోట్లు వచ్చాయి.
వీకెండ్స్ మరింత హయ్యెస్ట్
వారాంతంతోపాటు క్రిస్మస్ హాలిడేస్ లో కలెక్టన్స్ మరింత భారీగా పెరిగే అవకాశముందని సినీ నిపుణులు అంటున్నారు. ప్రభాస్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా ‘సలార్’ నిలిచిపోతుందన్న మాటలు వినపడుతున్నాయి. ఈ మూవీ పార్ట్-1 తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజయింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ‘డంకీ’ ఈనెల 21న ‘సలార్’ కన్నా ఒకరోజు ముందే విడుదలైంది. కానీ ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ క్రేజీకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ‘సలార్’పై రివ్యూను మెగాస్టార్ చిరంజీవి ‘X’లో పోస్ట్ చేశారు. ‘డియర్ దేవా’ సలార్ ప్రభాస్ కు శుభాకాంక్షలు.. ‘సలార్’ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ బద్ధలు కొడుతోంది.. కొత్త ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్.. పృథ్వీ, జగపతిబాబు, శృతిహాసన్ అదరగొట్టేశారు’ అంటూ ట్వీట్ చేశారు.