బాలీవుడ్ నటుడు(Actor) సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.2 కోట్లు ఇవ్వకుంటే ఆయన్ను చంపేస్తామంటూ ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ విభాగాని(Department)కి మెసేజ్ వచ్చింది. NCP(అజిత్ పవార్) పార్టీకి చెందిన బాబా సిద్దిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీని హత్య చేస్తామంటూ బెదిరించిన కొద్ది గంటల్లోనే సల్మాన్ పేరిట మెసేజ్ గుర్తించారు.
రూ.5 కోట్లు డిమాండ్ చేసిన జంషెడ్ పూర్ కు చెందిన కూరగాయల వ్యాపారి 24 ఏళ్ల షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్ ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్ లో వన్యప్రాణుల్ని వేటాడిన కేసులోనూ సల్మాన్ ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అనుకున్నట్లుగానే అనుమానాస్పద వ్యక్తులు ఈ ఏప్రిల్లో బాలీవుడ్ నటుడి ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఆ తర్వాత బాబా సిద్దిఖీని అతి దగ్గర్నుంచి కాల్చి చంపారు.