స్టార్ హీరోయిన్ సమంత మొత్తానికి విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘ఖుషి’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసింది. అలాగే హిందీలో వరుణ్ ధావన్‌తో చేస్తున్న ‘సిటడెల్’ వెబ్ సిరీస్ పూర్తి కావాల్సి ఉంది. రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ సైతం త్వరలోనే పూర్తికానుంది. ఇదిలా ఉంటే.. సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ప్రకటించనుందని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాను ఆరు నెలలు కష్టంగా గడిపానంటూ సామ్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘ఈ ఆరు నెలలు సుదీర్ఘంగా, చాలా కష్టంగా గడిచాయి. మొత్తానికి పూర్తిచేశాను’ అంటూ లవ్ సింబల్ ఎమోజీని యాడ్ చేసింది. కాగా గతేడాది మయోసైటిస్ బారిన పడిన సమంత ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. అయినప్పటికీ కమిటైన ప్రాజెక్టులను కష్టంగా పూర్తి చేసింది. దీంతో ఏడాది పాటు రెస్ట్ తీసుకోవడానికి తన ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇతర ప్రాజెక్టుల కోసం తాను ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చేసినట్లు సమచారం. ఈ క్రమంలో ‘సిటడెల్’ షూటింగ్ ముగిసిన వెంటనే సమంత అమెరికా వెళ్లనుందట. అక్కడే తన మెరుగైన చికిత్స తీసుకోనుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తు్న్నాయి.