నటీమణుల(Actresses)పై లైంగిక వేధింపుల విషయంలో మలయాళ ఇండస్ట్రీలో దుమారం రేగుతున్న వేళ.. ప్రముఖ నటి సమంత తెలుగు ఇండస్ట్రీ తీరుపై మాట్లాడారు. రెండేళ్ల క్రితం అందజేసిన రిపోర్టును ఎందుకు బయటపెట్టట్లేదని ప్రశ్నించారు. కేరళ సినిమా పరిశ్రమ అఘాయిత్యాలపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికతో ఒక్కో నటీమణి బయటకు వస్తున్నారు.
2022లో సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును తెలంగాణ ప్రభుత్వమూ వెల్లడించాలన్నారు. డైరెక్టర్ నందినిరెడ్డి, మంచు లక్ష్మీ, సింగర్స్ చిన్మయి శ్రీపాద, కౌసల్య, యాంకర్స్ సుమ, ఝాన్సీ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తనకు జరిగిన అన్యాయంపై నటి శ్రీరెడ్డి తెలుగు సినిమా ఛాంబర్ ఎదుట అర్ధ నగ్న(Semi-Nude) నిరసన తర్వాత.. అధికారులు, పోలీసులు, పౌరసమాజ లీడర్లతో కమిటీ ఏర్పాటైంది.
14 ఏళ్ల కెరీర్లో 50 తెలుగు మూవీల్లో నటించిన సమంత.. మలయాళీ ఇండస్ట్రీలో వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(WCC) మాదిరిగానే 2019లో టాలీవుడ్ లోనూ వాయిస్ ఆఫ్ వుమెన్(VOW) ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు.