ముగ్ధమనోహర సౌందర్యంతో చిత్రసీమను ఏలిన అలనాటి అగ్రనటి బి.సరోజాదేవి(87) కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఆమె.. బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ‘పాండురంగ మహత్మ్యం’తో తెలుగులో అడుగుపెట్టి 200 పైగా చిత్రాల్లో నటించారు. ‘మహాకవి కాళిదాస’కు జాతీయ అవార్డుతోపాటు 1969లో పద్మశ్రీ(Padmasri) 1992 పద్మభూషణ్, ఆ తర్వాత లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు అందుకున్నారు. 1940 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి.. దిలీప్ కుమార్, వైజయంతిమాల నటించిన ‘పైగామ్’ ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ప్యార్ కియాతో డర్నా క్యా వంటి చిత్రాలతో దేశవ్యాప్త ప్రాచుర్యం పొందారు. https://justpostnews.com