
గతేడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన RRR మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ సైతం గెలుచుకుంది. ఈ మేరకు ఆస్కార్ గెలుచుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డ్ సృష్టించిన RRR మూవీ సీక్వెల్‌పై రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా హింట్ ఇచ్చారు.

RRR మూవీకి వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు లభించగా.. దీనికి సీక్వెల్ తీయాలనే ఆలోచనలపై గతంలో రాజమౌళి సైతం స్పందించారు. ఇక తాజా ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను ఇదే విషయం అడిగినప్పుడు.. RRR 2 కోసం ప్లానింగ్ ఉందని, ఆ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ మూవీగా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లుగా తెలిపింది. ఇక ఈ అప్డేట్ గురించి విన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ స్టైల్లో యాక్షన్-అడ్వెంచర్‌గా ఉండనుందని విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.