
ఒక కుటుంబం నుంచి ఎక్కువ మంది వారసులంటే నందమూరి, అక్కినేని ఫ్యామిలీలే గుర్తుకొస్తాయి. ఈ లిస్టులోకి కృష్ణ కుటుంబం వచ్చేసింది. ఆయన తనయులు రమేశ్, మహేశ్ ఇప్పటికే హీరోలుగా చేశారు. మహేశ్ చెల్లి ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు సినిమాలు చేస్తున్నాడు. గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ రెండు మూడు మూవీలు చేశాడు. ఈయన మహేశ్ కు అల్లుడు. ఇక మహేశ్ తనయుడు గౌతమ్ సైతం అమెరికాలో యాక్టింగ్ లో శిక్షణ పొందుతున్నాడు. తనయ సితార సైతం యాడ్స్ లో నటించింది. రమేశ్ బాబు పుత్రుడు జయకృష్ణ తొలి సినిమాకు రెడీ అయ్యాడని టాక్. మంజుల కూతురు జాన్వి ఇండస్ట్రీలో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. సుధీర్ బాబు తనయులూ కొత్త తరంగా కాలు పెట్టబోతున్నారు. ఇలా ఒకరిద్దరు కాకుండా ఏకంగా ఏడుగురు సినిమా పరిశ్రమకు రాబోతున్నారు. ఇందులో ఎంతమంది నిలదొక్కుకుంటారో చూడాలి.