‘RRR’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆస్కార్ పురస్కారాల్ని కొల్లగొట్టిన ‘RRR’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. చెర్రీ అభిమానుల్లో భారీగానే అంచనాలు(Hopes)న్నాయి. సంచలన దర్శకుడు ఎస్.శంకర్ డైరెక్షన్ లో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ విడుదల మరింత జాప్యమయ్యే అవకాశం కనపడుతున్నది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నా ఏడాది కింద మొదలైన షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ చివరి దశకు చేరుకుందని చెబుతున్నా… రిలీజ్ డేట్(Release Date) ఎప్పుడన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది.
ప్రస్తుతానికి దర్శకుడు శంకర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ‘ఇండియన్-2’ సైతం భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్నది. ఈ ‘ఇండియన్-2’తోపాటు మరో సినిమాని సైతం ఒకే టైమ్ లో పట్టాలెక్కించడంతో చెర్రీ మూవీ విషయంలో జాప్యం(Late) కనపడుతోంది. ‘గేమ్ ఛేంజర్’ను దసరా(Festival) ముందు తీసుకువస్తామని గతంలోనే దిల్ రాజు చెప్పినా.. అది సాధ్యం కావడం లేదన్నది సినీ ఇండస్ట్రీ టాక్. ఆ టైమ్ లో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో చెర్రీ మూవీపై అనుమానాలు కనిపిస్తున్నాయి.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’లో.. రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్ని పోషిస్తున్నారు. చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.. సముద్రఖని, నాజర్, ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విశేషాల్ని తొలుత 2021 ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తే.. టైటిల్ ను అదే ఏడాది మార్చిలో ప్రకటించారు. రామ్ చరణ్ 15వ సినిమాగా థమన్ మ్యూజిక్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’.. హైదరాబాద్, మహారాష్ట్ర, పంజాబ్, న్యూజిలాండ్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకొంది.
‘ఇండియన్’ సినిమాను భారతీయుడిగా తెలుగులో విడుదల చేసిన శంకర్.. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కానీ ఇప్పటిదాకా ఆయన స్ట్రెయిట్ గా తెలుగు సినిమా చేయలేదు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’తో ఆ లోటును తీర్చుకుంటూ డైరెక్ట్ గా తెలుగు ఫిల్మ్ కు డైరెక్షన్ చేస్తున్నారు. తొలుత ఈ సినిమా గురించి ప్రకటించినపుడు టైటిల్ ‘RC 15’గా తెలిపారు. కానీ 2023 మార్చి 27న ఈ మూవీ పేరును ‘గేమ్ ఛేంజర్’గా మార్చినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. మొదట రూ.200 కోట్లతో సినిమాను తీయాలని భావించినా నిర్మాత కోరిక మేరకు దాన్ని రూ.170 కోట్లకు చేశారు. కానీ అటు ‘ఇండియన్-2’ మాత్రం రూ.450 కోట్లతో తుది దశకు చేరుకుంది.