స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. శివా నిర్వాణ దర్శకుడు. మరో రెండు మూడు రోజుల్లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇంకా తాను హిందీలో చేస్తున్న ‘సిటడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. అయితే, ఈ రెండు బడా ప్రాజెక్ట్స్ తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని సమాచారం. ఓ ఏడాది పాటు విశ్రాంతి తీసుకోనుందని, ఈ మేరకు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోనుందని తెలుస్తోంది.
ఇప్పటికే సామ్.. తెలుగు, తమిళ్, హిందీలో ఎటువంటి కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత.. దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఈ బ్రేక్ టైమ్‌ను ఉపయోగించుకోనుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుకే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లు సైతం నిర్మాతలకు ఇప్పటికే తిరిగి ఇచ్చేసినట్లు రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ, తను ఇదివరకు సైన్ చేసిన ప్రాజెక్ట్స్‌ను కమిటెడ్‌గా పూర్తి చేసి తన ప్రొఫెషనలిజాన్ని నిరూపించుకుంది.